భూ రీసర్వే పనులపై అదనపు కలెక్టర్ తనిఖీ

కలం, వనపర్తి: భూ రీసర్వే పనులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పెద్దమందడి మండలం వీరాయిపల్లి (Veeraipally) గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర భూ రీసర్వే పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల కొలతలు, సరిహద్దుల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు.

సర్వే నంబర్ల వారీగా కొలతలు చేపట్టి, భూయజమానులు, రైతుల సమక్షంలోనే హద్దులను గుర్తించాలని సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా సరిహద్దు రాళ్లను పక్కాగా ఏర్పాటు చేసి, వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలన్నారు. రీసర్వే సమయంలో రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. భూ రికార్డుల్లో కచ్చితత్వం తీసుకురావడం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే సమగ్ర రీసర్వే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ విజయవంతానికి రైతులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వే, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>