కలం, మధిర: ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు, సరిహద్దు చెక్పోస్టులపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు (Khammam Vigilance Raids) నిర్వహించారు. మార్కెట్లలో జరుగుతున్న అక్రమ కొనుగోళ్లు, మార్కెట్ ఫీజుల ఎగవేతను అరికట్టే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న, లైసెన్సులు లేని వ్యాపారులను గుర్తించి వారికి అధికారులు తక్షణ నోటీసులు జారీ చేశారు.
ముఖ్యంగా మధిర, సత్తుపల్లి, వైరా పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అపరాధ రుసుం కింద మొత్తం రూ. 2,57,712 వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా, మార్కెట్లలో అక్రమాలకు తావులేకుండా కొనుగోళ్లు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత తీవ్రతరం చేశామని, నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

