కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో విజయవాడ నూతన మేయర్ వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radhakrishna) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను తన కుటుంబ సభ్యులతో కలిశారు. తనకు మేయర్ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగర అభివృద్ధి, ఇతర అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరిన వంగవీటికి పవన్ కళ్యాణ్ మేయర్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక జనసేన తాను పోటీ చేసిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒక్క చోట ఓడిపోకుండా అన్నింటా గెలిచి మరోసారి సత్తా చాటింది.

