పోలీస్ క్రికెట్ జట్టుకు వరంగల్ సీపీ అభినందన

కలం, వరంగల్: రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (Warangal CP Shwetha) మంగళవారం అభినందించారు. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న 5వ రాష్ట్రస్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌–2026లో క్రికెట్ విభాగంలో వరంగల్ జట్టు ప్రాతినిధ్యం వహించనుంది. ఇందుకోసం కమిషనరేట్ నుంచి క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. గీసుగొండ ఇన్‌స్పెక్టర్ డి.విశ్వేశ్వర్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. పోటీల్లో సమష్టి కృషి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని సీపీ శ్వేత సూచించారు. వ్యక్తిగత ప్రతిభతో పాటు జట్టు సమన్వయానికి ప్రాధాన్యమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>