కలం, హనుమకొండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బుధవారం కాజీపేటలో పర్యటించబోతున్నారు. బీసీ సంక్షేమ బాలుర వసతిగృహం ప్రాంగణంలో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) నూతన భవన నిర్మాణానికి మధ్యాహ్నం 12 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పాఠశాల స్థలాన్ని, శంకుస్థాపన ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్డీవో వెంకటేశ్, టీడబ్ల్యూఐడీసీ ఈఈ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : గుకేశ్‌కు గట్టి పోటీ.. సిందరోవ్‌కే మొగ్గు!
Follow Us On: X(Twitter)

