బేతుపల్లి చెరువు ఘటనపై పొంగులేటి పర్యవేక్షణ.. సిబ్బంది సురక్షితం?

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ​సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు (Bethupally Cheruvu) అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘మురసు’ తుపాను ప్రభావంతో చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందం బోటు తిరగబడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతైన సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో కొందరితో ఫోన్ మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది.ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే మంత్రి అప్రమత్తమై… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌లతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా, ప్రమాదంలో చిక్కుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సమీప ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లు తేలింది. వారిని త్వరలోనే పూర్తిగా ఒడ్డుకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.

​సిబ్బంది అందరూ సురక్షితంగా బయటకు వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని మంత్రి హెచ్చరించారు. అవసరమైన రక్షణ పరికరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి పొంగులేటి, స్వయంగా పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>