రాయిగూడలో ఘనంగా దండారి ఉత్సవాలు.. సందడి చేసిన బోథ్ ఎమ్మెల్యే

కలం, సిరికొండ : ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. బుధవారం సిరికొండ మండలం రాయిగూడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ దండారి ఉత్సవాల్లో పాల్గొని ఆదివాసులతో కలిసి వేడుకల్లో సందడి చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రతి దండారి ఉత్సవానికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేవారని గుర్తుచేశారు. ఆదివాసుల సంస్కృతి పరిరక్షణ కోసం జోడేఘాట్‌లో రూ.12 కోట్లతో మ్యూజియం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘మావా నాటే మావా రాజ్’ నినాదానికి అనుగుణంగా ఆదివాసీ గ్రామాల్లో వారి పాలనకు ప్రాధాన్యం కల్పించారని అన్నారు. గ్రామస్థులు దండారి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక షెడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరగా, నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ శిష్యుడిగా దండారి ఉత్సవాలకు తన వంతుగా రూ.11 వేల ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>