కొవ్వొత్తులతో ప్రవళికకు ఆర్టీసీ ఉద్యోగుల నివాళి

కలం, నిర్మల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ మృతి చెందిన గుండ్ల ప్రవళికకు నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు (Nirmal RTC Employees) బుధవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆర్టీసీ డిపో నుంచి మినీ ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రవళిక మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులపై దాడులను అరికట్టాలని, విధి నిర్వహణలో వారికి తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రవళిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ జేఏసీ నాయకులు, మహిళా కండక్టర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>