విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ప్రకారమే యూనిఫామ్‌లు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్స్ , అలాగే హాస్టల్ విద్యార్థులకు అందించిన స్కూల్ యూనిఫాంలు, ఇతర కిట్ల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి నేరుగా వాట్సాప్ ద్వారా అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు కోరుకునే రంగులు, నాణ్యత, సైజులు , ఆకర్షణీయమైన డిజైన్లకే భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచే నాటికే యూనిఫాంలు, బ్యాగులు, షూలు, ప్లేట్లు వంటి అన్ని వస్తువులు పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందేలా ఇప్పటినుంచే స్పష్టమైన విధివిధానాలు , టెండర్ ప్రక్రియ, కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

బేతుపల్లి చెరువు ఘటనపై సీఎం రేవంత్ ఆరా

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి చెరువు(Bethupalli Lake)లో చిక్కుకున్న జాలర్లను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బోట్లు గల్లంతైన ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం (Revanth Reddy), సిబ్బందిని , అలాగే జాలర్లను సురక్షితంగా రక్షించేందుకు తక్షణమే అన్ని రకాల సహాయక చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా సమీక్షించి, రక్షణ చర్యలను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.

Also Read : పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>