రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ముఠా అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వియం బంజర పోలీస్ స్టేషన్ పరిధిలో రైతుల పొలాల్లోని ట్రాక్టర్ ఫుల్ వీల్స్, వ్యవసాయ పనిముట్లు దొంగతనం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు (Khammam Police) రట్టు చేశారు. సుమారు రూ. 6.50 లక్షల విలువైన చోరీ సొత్తుతో పాటు రెండు మినీ వ్యాన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

బుధవారం సాయంత్రం వియం బంజర సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.కె. షకీర్ సిబ్బందితో కలిసి ముత్తగూడెం గ్రామం వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా.. గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి కింద వ్యవసాయ పనిముట్లతో లోడ్ చేసిన రెండు మినీ వ్యాన్లను గుర్తించారు. అనుమానంతో తనిఖీ చేసి విచారించగా, నిందితులు చుట్టుపక్కల మండలాల్లో రైతుల పొలాల్లో ఫుల్ వీల్స్ చోరీ చేసి తిరువూరుకు తరలిస్తున్నట్లు తేలింది.

ఈ ముఠాపై వేంసూరు, వియం బంజర పోలీస్ స్టేషన్లలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ సర్వే, ఎస్.ఐ షకీర్, వేంసూరు ఎస్.ఐ ప్రదీప్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. పరారీలో  ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>