రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ (AP MPTC ZPTC) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మొత్తం 31,472 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసి, పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,645 సమస్యాత్మక, 1,841 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సిసి కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ నెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>