కలం, వెబ్ డెస్క్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రారంభమైంది. గన్ ఫౌండ్రీ వద్ద మొదలైన మొదలైన పాదయాత్ర నిజాం కాలేజీ గ్రౌండ్స్ మీదుగా ఎంజే మార్కెట్ వద్ద ముగుయనుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఈ మహా పాదయాత్ర చేపట్టబోతున్నారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీలు అమిత్ షా (Amit Shah) తో కలిసి నడుస్తున్నారు. జాతీయ జెండా పట్టుకున్న అమిత్ షా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తోందని.. ఢిల్లీలో నిర్వహిస్తున్న ర్యాలీకి కౌంటర్‌గా అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో ఈ పాదయాత్ర చేస్తున్నారు. అంతకుముందు అమిత్ షా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read : రష్యా యుద్ధంలో చిక్కుకున్న ఏపీ యువకులు!
Follow Us On: Youtube

