కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్ (Rajasthan) లోని ఛపోలి గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు నిర్మాణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుని 8 మంది కార్మికులు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. యంత్రం సహాయంతో కూలీలు కంకరను కలుపుతున్న సమయంలో పైన ఉన్న హై-టెన్షన్ విద్యుత్ తీగను యంత్రం తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

