రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి (Laxmidevipally) మండలం పరిధిలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక బావార్చి హోటల్ సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అదుపుతప్పి ఒక ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపై బోల్తా పడింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ​

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ అకస్మాత్తుగా అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊరట చెందారు. రద్దీ ప్రాంతాల్లో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండి, వేగ నియంత్రణ పాటించాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>