ఎంజీఎం ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

కలం, హనుమకొండ : వరంగల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఎంజీఎం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి (Chahat Bajpai) అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆదివారం ఆస్పత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్.. భవనం వెలుపల చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులు, వివిధ విభాగాల్లో కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల ప్రస్తుత స్థితిగతులు, పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సూచించారు. అవసరమైన సమన్వయంతో పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సురేష్‌బాబు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ దేవిక చౌహాన్, ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>