కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీరంగూడ (Beeramguda)లో ఇద్దరు డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. బస్టాండ్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు అమీన్‌పూర్ పోలీసులు కర్ణాటక నుంచి హృతిక్ డి.పాటిల్ (26), పాశమైలారం ప్రాంతానికి చెందిన సిద్ధార్థ్ (25)ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 10.50 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,26,000, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బెంగళూరుకు చెందిన సలోజ్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న సలోజ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

