కలెక్టర్ చొరవతో బాలుడి గుండె ఆపరేషన్ ఉచితం

కలం, ఆదిలాబాద్ : గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల నిరుపేద బాలుడు అంజికి హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం రూ.7 లక్షల విలువైన ఓపెన్ హార్ట్ సర్జరీని ఉచితంగా చేయించేందుకు ముందుకొచ్చింది. భోరజ్ మండలం పూసాయి గ్రామానికి చెందిన టాప్రే రేణుక, పొచ్చిరాం దంపతుల కుమారుడైన అంజి వైద్య పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajasrhi Shah) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సెప్టెంబర్ 10న రిమ్స్‌లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు.

దీంతో మెడికవర్ ఆసుపత్రి శస్త్రచికిత్స ఖర్చుతో పాటు కుటుంబానికి భోజనం, రవాణా సదుపాయాలు ఉచితంగా కల్పించేందుకు అంగీకరించింది. ఇదే శిబిరంలో మరో 40 మంది చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యలను గుర్తించగా, వారి అవసరాలకు అనుగుణంగా దశలవారీగా ఉచిత చికిత్స, శస్త్రచికిత్సలు అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సేవలకు కృతజ్ఞతగా బాలుడి తల్లిదండ్రులు, చిన్నారుల కుటుంబ సభ్యులు శనివారం కలెక్టర్ రాజర్షి షా (Rajasrhi Shah), వైద్య బృందాన్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ సింగ్ రాథోడ్, డీఏహెచ్‌ఓ సాధన తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>