రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: సుజీత్‌కు తప్పని నిరాశ

క‌లం, స్పోర్ట్స్‌: ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌(World Wrestling Championship)లో భారత స్టార్ రెజ్లర్ సుజీత్ కల్కల్‌ (Sujeet Kalkal)కు తీవ్ర నిరాశ ఎదురైంది. గురువారం జరిగిన పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో సుజీత్ తృటిలో ఓటమి పాలయ్యారు. ఘనమైన బోణీతో టోర్నీని ప్రారంభించిన సుజీత్, తొలి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన నినో లూటెర్ట్‌పై 12-1 తేడాతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత అస్తానాలో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో తజికిస్థాన్ ఆటగాడు అబ్దుల్ మజీద్ కుదీవ్‌తో తలపడ్డారు. మొదట సుజీత్ 3-1 ఆధిక్యంలో నిలిచారు.

కానీ కుదీవ్ ఆ తర్వాత టేక్‌డౌన్‌ సాధించి మ్యాచ్‌ను 3-3తో సమం చేశారు. టై బ్రేకర్ నిబంధనల ప్రకారం కుదీవ్ విజయం సాధించారు. అటు 97 కేజీల విభాగంలో విక్కీ హుడా జపాన్‌కు చెందిన అరష్ యోషిడా చేతిలో 2-12 తేడాతో ఓడిపోయారు. అయితే సుజీత్ (Sujeet Kalkal), విక్కీలను ఓడించిన ప్రత్యర్థులు ఫైనల్‌కు చేరితే, భారత రెజ్లర్లకు రేప్‌చేజ్ రౌండ్ ద్వారా పతకం గెలిచే అవకాశం లభిస్తుంది. మహిళల విభాగంలో మనీషా అద్భుత ప్రదర్శన చేశారు.

క్వార్టర్‌ఫైనల్లో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూరెగార్డ్‌ను 6-2తో, ఆ తర్వాత మంగోలియాకు చెందిన బోలోర్టుయా ఖురెల్ఖూను 6-0తో ఓడించి 59 కేజీల సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇక 55 కేజీల విభాగంలో అహిల్య షిండే తొలి పోరులో క్యూబా ఆటగాడు యైనెలిస్ సాన్జ్ వర్దేసియాపై 8-1తో గెలిచారు. కానీ క్వార్టర్‌ఫైనల్లో తుర్కియేకు చెందిన తుబా డెమిర్ చేతిలో 6-9 తేడాతో ఓటమి చెందారు. డెమిర్ ఫైనల్‌కు చేరితే అహిల్యకు కూడా కాంస్య పతకం కోసం పోటీపడే అవకాశం దక్కుతుంది. భారత రెజ్లర్ల తదుపరి రౌండ్ అవకాశాలు ప్రత్యర్థుల ఫైనల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి.

Also Read : నెయ్‌మార్‌‌పై బ్యాన్.. మైదానంలో ఆ పని చేసినందుకు వేటు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>