ఏపీకి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక.. వారం రోజులు అలర్ట్!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రానున్న ఏడు రోజుల పాటు వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమలో కూడా మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ఈ వర్షాల తీవ్రత దృష్ట్యా ఏపీలోని 14 జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచివున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. నేడు ఉదయంలోగా గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Also Read : వరద ఉధృతి.. విశాఖ జిల్లాలో జలాశయాలు కళకళ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>