కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farmhouse) లో మరోసారి సర్వే చేపట్టారు. ఎర్రవల్లి – శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల నిర్దారణలో భాగంగా వ్యవసాయ క్షేత్రం పాత గేటు, ఫస్ట్ గేటు నుండి ఫార్మ్ హౌస్ లోపల ఉన్న గ్రామాల సరిహద్దులను సర్వే సిబ్బంది పరిశీలించారు. ఈ రెండు గ్రామాల సరిహద్దుల నిర్దారణ సర్వేలో భాగంగా సర్వే సిబ్బంది గ్రామాల హద్దులకు పరిశీలన కోసం ఫామ్ హౌస్ గేటు వద్ద సెక్యూరిటి సిబ్బందితో మాట్లాడుతున్న సందర్భంగా .. అటుగా వెళ్తున్న కేసీఅర్ సర్వే సిబ్బందిని గమనించారు.
తర్వాత సెక్యూరిటి సిబ్బందితో మాట్లడి సర్వే సిబ్బందిని వారి పని చేసుకొనివ్వాలని చెప్పినట్టు సమాచారం . దీంతో ఎర్రవల్లి – శివారు వెంకటపూర్ గ్రామాల సరిహద్దుల నిర్ధారణ సర్వేలో భాగంగా ఫార్మ్ హౌస్ (KCR Farmhouse) లోని హద్దులను ముగ్గురు సర్వే సిబ్బంది పరిశీలించి వచ్చినట్టు తెలుస్తోంది. కేసీఅర్ ఫార్మ్ హౌస్ లోపల గ్రామ సరిహద్దుల పరిశీలన చేశామే తప్ప ఎలాంటి సర్వే నిర్వహించలేదని అధికారులు తెలిపారు.
మరోవైపు గ్రామాల సరిహద్దులను సర్వే చేస్తున్న సర్వే సిబ్బంది, రెవెన్యూ అధికారులుతో శివారు వెంటకపూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు వాగ్వాదానికి దిగారు. తమ గ్రామంలోని వివిధ సర్వే నెంబర్ల లోని మిస్ అయిన 136 ఎకరాల తెల్చిన తర్వాత గ్రామాల సరిహద్దుల సర్వే చేయాలని కొరారు. గ్రామాల సరిహద్దుల నిర్ధారణతో పాటు , శివారు వెంకటపూర్ గ్రామంలోని పలు సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించి పక్కాగా సర్వే చేసి వివరాలు తెల్చాలని గ్రామస్తులు కోరారు.

