పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి

కలం, సారంగాపూర్‌: గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు (Sanitation Workers) పెండింగ్‌లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని గ్రామపంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు క్లైమేట్‌ వెస్లీ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలో బుధవారం యూనియన్‌ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవో నం.6 ప్రకారం నెలకు రూ.18,500 వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

గ్రామాల పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆర్థిక, ఉద్యోగపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగల సమయంలోనూ వేతనాలు అందక నిత్యావసర వస్తువుల కొనుగోలు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>