ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ సెటైర్లు

కలం, వెబ్ డెస్క్ : నాలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు. “నాలుగు పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటకలలోని 28 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఊహించండి?” అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బ్యాలెట్ విధానంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని గెలిచిందో చెప్పాలని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలకు ప్రచారం చేస్తున్నాయి. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలని ఇండి కూటమి పార్టీలు డిమాండ్ తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లోని 28 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలను బుధవారం ప్రకటించారు. అయితే, నాలుగు రాష్ట్రాల్లో జరిగి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. కర్ణాటకలో ఒక్క సీటు కూడా సాధించలేదు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఐదు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మూడు సీట్లు గెలుచుకున్నాయి. ఈ క్రమంలోనే నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరుపై మోదీ (PM Modi) విమర్శలు గుప్పించారు.

Also Read : ఢిల్లీలో స‌ర్ ప్ర‌క్రియ‌పై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>