కలం, బైంసా: కుంటాల మండలం కల్లూరు గ్రామంలో రజక సంఘం (Rajaka Sangam) కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ సంఘం సభ్యులు బుధవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. దశలవారీగా రజక సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని సూచించారు. వారితో కొద్దిసేపు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంటాల మండల బీజేపీ నాయకుడు నవీన్, వార్డు సభ్యులు, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

