ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కలం, జడ్చర్ల: జడ్చర్ల మండలం బండమీదిపల్లి (Bandameedipalli) గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయని గ్రామ సర్పంచి పాండు జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించి పట్టాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 322లో నిర్మించిన ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్లుగా మారుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

సర్పంచి, వార్డు సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండానే పంచాయతీ కార్యదర్శి పట్టాలిస్తున్నారని.. దీనిపై ఆందోళన చేపడుతామన్నారు. గత ప్రభుత్వంలో కొందరికి కేటాయించిన ఇళ్లను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులకు మాత్రమే కేటాయిస్తూ.. అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రమేష్, పెంటయ్య, ఉమాదేవి, చంద్రకళ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>