నల్లగొండకు హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ రాక

కలం, నల్లగొండ : రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ (Telangana HRC Chairperson) డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ (Justice Shameem Akther) బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. బుధవారం ఉదయం 8:15 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి, ఉదయం 10:15 గంటలకు నల్గొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. ఉదయం 10:15 గంటల నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ప్రజల వద్ద నుండి సమస్యలు, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అర్జీలను, ఫిర్యాదులను నేరుగా స్వీకరిస్తారు.

ఫిర్యాదుల స్వీకరణ అనంతరం నల్గొండలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు (హాస్టళ్లు), ప్రభుత్వ ఆసుపత్రులను చైర్‌పర్సన్ స్వయంగా సందర్శించి వసతులను పరిశీలిస్తారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 6:30 గంటలకు నల్గొండ నుండి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమవుతారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యలు లేదా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను బుధవారం ఉదయం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో హెచ్‌ఆర్‌సీ చైర్‌పర్సన్‌కు నేరుగా అందజేసి వినతులు సమర్పించవచ్చని కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>