సుప్రీం కోర్టులో వైసీపీకి భారీ షాక్

కలం, వెబ్ డెస్క్: వైసీపీ (YSRCP)కి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) నామినేషన్ల గడువును పెంచాలని వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీలను భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రెండు వారాల తరువాత నామినేషన్లు వేయలేనివారు ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించుకోవచ్చని, విచారణ జరుపుతామని పేర్కొంది.

ఈ సందర్భంగా సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం వైసీపీ పిటిషనర్‌ను ఉద్దేశించి ‘ఆల్ ది బెస్ట్.. మీరు ఎన్నికలకు వెళ్లండి’ అని పేర్కొంది. విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. మరికాసేపట్లో గడువు ముగియబోతున్న తరుణంలో ఇప్పుడు నామినేషన్ల గడువు పొడిగింపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ధర్మసనానికి వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు.. పిటిషన్ కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

నామినేషన్లు వేయనివ్వడం లేదని..

స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని వైసీపీ (YSRCP) ప్రధానంగా ఆరోపించింది. కొన్ని చోట్ల పోలీసులే తమను నామినేషన్ కేంద్రాలకు వెళ్లకుండా నిలువరించారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్లు గడువును పొడిగించాలని హైకోర్టును ఆశ్రయించినా అక్కడ చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లగా పిటిషన్ కొట్టేసింది. దీంతో నామినేషన్ల అర్హత పొందినవారు పోటీలోకి దిగబోతున్నారు.

Also Read : ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>