కలం, వెబ్ డెస్క్: ఐటీ రంగంలో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 60 వేల మంది ఉద్యోగులను బయటకు పంపించేందుకు రంగం సిద్ధం చేసింది. వారికి వాలంటరీ బై అవుట్ ఆఫర్ ప్రకటిస్తూ.. ఉద్యోగులకు మెయిల్స్ సమాచారం అందిస్తోంది. ఈ విధానం ప్రకారం.. సంస్థ నుంచి వెంటనే వెళ్లిపోయేవారికి కొంత ప్యాకేజీ ఇచ్చి రిలీవ్ చేస్తారు.
ఒకరకంగా ఇది బలవంతపు ఉద్యోగ రాజీనామాగా.. రాబోయే రోజుల్లో భారీగా ఉద్యోగాల కోతకు ప్రారంభంగా టెక్ నిపుణులు చెబుతున్నారు. భారత్, అమెరికా, కెనడా, యూకే దేశాల్లోని సంస్థ ఉద్యోగులకు ఈ విధానం వర్తించనుంది. మొత్తంగా చూస్తే గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 27 శాతం మందికి లే ఆఫ్స్ ఆఫర్ అమలు కానుంది. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ఈ నిర్ణయంతో ఐటీ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. త్వరలోనే తమ సంస్థలు కూడా అదే దారిలో వెళ్తాయా.. అనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఇవే కారణాలు..
రోజురోజుకు ప్రపంచంపై ఏఐ టెక్నాలజీ (AI Technology) చూపుతున్న ప్రభావం నేపథ్యంలో సంస్థను పూర్తిగా ఏఐ మోడ్‌లోకి మార్చడంతో పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఈ ఆఫర్ ప్రకటించింది. అయితే కొన్ని విభాగాల వారిని దీని నుంచి మినహాయించారు. డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లోని ఉద్యోగులు ఎప్పటిలాగే కొనసాగొచ్చని కంపెనీ ప్రకటించింది.
ఏఐ, కోపైలట్, విండోస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ ఉద్యోగులపై మాత్రం తీవ్రంగా ఉండనుంది. వాలంటరీ బై అవుట్ ఆఫర్ ప్రభావం భారత్‌పై కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ సుమారు 27 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ (Microsoft) క్యాంపస్‌లో కూడా రెండు వేల మందికి పైగా ఉన్నారు. వీరంతా త్వరలోనే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
Also Read : అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్లు రద్దు
Follow Us On: X(Twitter)

