కలం, నిర్మల్: ఉట్నూర్, కడెం ప్రాంతాల్లో పీఎం-జన్‌మన్ పథకం కింద మంజూరైన ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) సంబంధిత అధికారులను ఆదేశించింది. టైగర్ జోన్ పరిధి కారణంగా అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ కమిషన్ సభ్యుడు జటోత్తు హుస్సేన్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో కమిషన్ విచారణ నిర్వహించింది. గిరిజన సంక్షేమ, అటవీశాఖ అధికారులకు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించగా, త్వరలో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని ఆదివాసీ కుటుంబాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

