ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక హామీ

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేయడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) స్పష్టం చేశారు. సోమవారం కూసుమంచి మండలం గోరిల్లపాడు తండాలో(Gorilapadu Thanda) రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామంలో డబుల్ రోడ్డు, పొలాలకు వెళ్లే దారులు, స్మశానవాటికల ఏర్పాటుకు తక్షణ చర్యలు చేపట్టి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. L1, L2, L3 జాబితాల్లో అర్హులైన పేదవారికి సంబంధించి ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్ది ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారైనా అర్హత ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మొదటి విడతతో పాటు, రెండు, మూడు, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, డీపీవో వినోద్ కుమార్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, కూసుమంచి ఎంపీడీవో జస్వంత్ కుమార్, తహసీల్దార్ సైదులు, స్థానిక సర్పంచ్ బానోత్ సరస్వతి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>