గోవా వేదికగా ఐపీఎల్ 2027 మినీ వేలం!

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి (IPL Mini Auction) ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది డిసెంబర్ 16న గోవాలో వేలం నిర్వహించనున్నారు. బెంగళూరులో భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే జరిగే రోజే ఈ వేలం కూడా జరగనుంది. వేలానికి ఒక నెల ముందు, నవంబర్ 15 నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆటగాళ్ల వివరాలను బోర్డు ఫ్రాంచైజీలకు పంపుతుంది.

వేలానికి వారం ముందు ఆటగాళ్ల వివరాలు, సెట్ల వర్గీకరణ పూర్తవుతాయి. మరోవైపు ట్రేడింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. లక్నో జట్టు తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఢిల్లీకి ఇచ్చి, కుల్‌దీప్ యాదవ్‌ను తీసుకుంది. అలాగే ఢిల్లీ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌ను హైదరాబాద్‌కు ఇచ్చి, స్పిన్నర్ జీషాన్ అన్సారీని సొంతం చేసుకుంది. ట్రేడింగ్ విండో వేలానికి వారం ముందు వరకు తెరిచి ఉంటుంది.

2027 సీజన్ మ్యాచ్‌లు మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న సైకిల్‌లో ఇది ఆఖరి మినీ వేలం. 2028 సీజన్ కోసం మెగా వేలం (IPL Mini Auction) నిర్వహించనున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>