మణుగూరు యువ క్రికెటర్‌కు జిల్లా జట్టులో చోటు

కలం, మణుగూరు : క్రీడా రంగంలో మణుగూరు (Manuguru) ప్రాంత యువత మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్-17 (Khammam Under 17) బాలుర ఎస్జీఎఫ్ క్రికెట్ జట్టుకు మణుగూరులోని ప్రతిష్టాత్మక ఎలైట్ క్రికెట్ అకాడమీ విద్యార్థి టీజీటీ కౌశిక్ ఎంపికయ్యారు. కొత్తగూడెంలోని స్థానిక ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్-17 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో కౌశిక్ తన అద్భుతమైన ప్రతిభను కనబరిచి, సెలెక్టర్లను ఆకట్టుకుని జిల్లా జట్టులో స్థానం సంపాదించుకోవడం విశేషం.

మణుగూరు ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ కౌశిక్ ఈ ఘనత సాధించడంపై ఎలైట్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. అకాడమీలో అందించిన పకడ్బందీ శిక్షణ, కౌశిక్ నిరంతర సాధన, పట్టుదల, క్రమశిక్షణే ఈ విజయానికి ప్రధాన కారణమని కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా జట్టుకు ఎంపికైన కౌశిక్‌ను అకాడమీ పెద్దలు, తోటి క్రీడాకారులు ఘనంగా అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే జోరును కొనసాగిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలని ఆకాంక్షించారు.

Also Read : భువీకి మోర్కెల్ అండ.. ఒత్తిడి వద్దు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>