అయ్యప్ప స్వాముల పాదయాత్ర విజయవంతం కావాలి: ఎమ్మెల్యే

కలం, బాసర: అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో సునీల్‌ దత్‌ గురుస్వామి నేతృత్వంలో బాసర నుంచి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధి వరకు చేపట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra) సోమవారం ప్రారంభమైంది. ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ (MLA Pawar Rama Rao Patel) ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర నాలుగోసారి విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు మేలు జరిగి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో చేపట్టిన ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మోళ్ల దత్తాత్రి, బీజేపీ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>