కలం, ఖమ్మం బ్యూరో : చారిత్రక పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో(Bhadrachalam) శబరి స్మృతి యాత్ర (Sabari Smriti Yatra) సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ప్రాంతంలోని ఆదివాసీ సంఘాలన్నింటినీ సమన్వయం చేస్తూ, వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలను ఈ యాత్రకు రప్పించారు. భద్రాచలం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భద్రాచలం పురవీధుల్లో శబరి శోభాయాత్రను ఘనంగా చేపట్టారు. రామాయణంలో శబరి మాతకు ప్రత్యేక గుర్తింపు, విశిష్టత ఉన్నాయని, ఆమె భక్తిని స్మరించుకుంటూ దేవస్థానం తరఫున ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణతో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని శబరి స్మృతి యాత్రను విజయవంతం చేశారు. అనంతరం శబరి జ్ఞాపకార్థం ప్రత్యేకంగా కల్యాణోత్సవం కూడా నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

