కలం, నిర్మల్ : జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు (NHM Employees) తమ సమస్యల పరిష్కారం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
గత 20 ఏళ్లుగా ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మిషన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్కు అందజేశారు.

