మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం : నిర్మల్ అదనపు ఎస్పీ

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి (Valmiki Jayanti) వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్కృత సాహిత్యంలో ఆదికవిగా పేరొందిన మహర్షి వాల్మీకి రచించిన రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, మానవత్వం వంటి ఉన్నత విలువలను సమాజానికి అందించిందన్నారు. రామాయణంలోని ఆదర్శాలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, మహర్షి వాల్మీకి సాహిత్య సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ అధికారి నర్సమ్మ, ఆర్‌ఐలు రామనిరంజన్, శేఖర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Also Read : తుమ్మిడిహెట్టికి మోక్షం?: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య బిగ్ డీల్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>