బోరబండలో విషాదం.. వాటర్ హీటర్‌తో నీళ్లు వేడి చేస్తుండగా..!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని బోరబండ (Borabanda) లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ హీటర్ తో నీళ్లు వేడి చేస్తూ విద్యుత్ షాక్ కు గురై ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బోరబండ పరిధిలోని భరత్ నగర్ లో నివసించే ఉస్మాన్ అనే వ్యక్తి ఇంట్లో ఆయేషా సిద్దిఖ (26), అబ్దుల్ రవూఫ్ దంపతులు అద్దెకు ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు.

ఆయేషా బకెట్ లో ఇమ్మర్షన్ హీటర్ రాడ్ వేసి నీళ్లను వేడి చేసింది. అయితే, హీటర్ ఆన్ లో ఉండగానే ఆమె స్టీల్ మగ్ తో బకెట్ లోని నీటిని తీయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా తీవ్ర విద్యుత్ షాక్ కు గురై ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె భర్త రవూఫ్​ ఇంట్లో లేరు. బయట నుంచి ఇంటికి వచ్చిన ఆయన భార్య పరిస్థితిని గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>