ఏడాదిన్న‌ర పాటు డిప్రెష‌న్‌తో పోరాడాను: అమిత్‌ మిశ్రా

క‌లం, స్పోర్ట్స్‌: భారత జట్టులో చోటు కోల్పోయాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ అవకాశాలు రాలేదు. తన తప్పేంటో అర్థం కాక సతమతమయ్యాడు. ఆ కష్టకాలంలో మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోలేకపోయాడు. ఇలా ఏడాదిన్నర పాటు డిప్రెషన్‌తో పోరాడానని భారత మాజీ క్రికెటర్‌ అమిత్‌ మిశ్రా (Amit Mishra) వెల్లడించాడు. 2003లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మిశ్రాకు ఆ తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. దులీప్‌ ట్రోఫీ, ఇండియా-ఎ జట్లకు కూడా ఎంపిక కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు.

ఒక దశలో తన ప్రదర్శన బాగోలేదని సెలెక్టర్‌ చెప్పడంతో తన ఆటతీరుపై ఆలోచనలో పడ్డాడు. భారత జట్టులోకి తిరిగి రావాలనే ఆలోచనతోనే ఉండిపోయానని, దేశవాళీ క్రికెట్‌లో రాణించడంపై దృష్టి పెట్టలేకపోయానని మిశ్రా తెలిపాడు. ఆ సమయంలో తన బాధను చెప్పుకునేందుకు ఎవరూ లేరని, కుటుంబానికి చెబితే వారు మరింత ఆందోళన చెందుతారని మౌనంగా ఉండిపోయానని వెల్లడించాడు.

పట్టుదలతో మళ్లీ జట్టులోకి..

ఆ కష్టకాలం నుంచి బయటపడేందుకు ఆటపైనే దృష్టి పెట్టానని, బ్యాటింగ్‌లోనూ మెరుగుపడేందుకు కృషి చేశానని చెప్పారు. మెరుగైన ప్రదర్శనతో దులీప్‌ ట్రోఫీకి ఎంపికయ్యానని వెల్లడించారు. చివరకు 2008లో భారత జట్టులోకి తిరిగి వచ్చి ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అరంగేట్రం చేశానని గుర్తు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>