అనారోగ్య బాధితుడికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కలం, సోన్ :  సోన్ మండలం న్యూ బొప్పారం (New Bopparam) గ్రామానికి చెందిన లోలం సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 2 లక్షల ఎల్‌ఓసీ చెక్కును (LOC Cheque) బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎంతో ఆసరాగా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>