కలం, నిజామాబాద్ బ్యూరో: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై నిజామాబాద్ (Nizamabad) లో నిరసన వ్యక్తమైంది. SIR ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద శనివారం భారీ నిరసన (SKM Protest) చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో ఓటర్ల జాబితా నుండి తొలగించిన ఓట్లను యథాతథంగా పునరుద్ధరించాలని వారు స్పష్టం చేశారు. అనంతరం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమం SKM జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య ఆధ్వర్యంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, ఎస్కేయం కన్వీనర్లు బి. దేవారం వేల్పూర్ భూమయ్య, పి. వెంకటేష్, పి. వరదయ్యలు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలోని అక్రమ SIRకు, ముఖ్యంగా విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు, న్యూఢిల్లీలోని RSS-BJP కూటమి జరిపిన దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటాలకు మద్దతుగా జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.
SIR ను తక్షణమే రద్దు చేయాలని, భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించి, ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పారదర్శకత లేకుండా ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన 13.41 కోట్ల మంది పౌరులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని, ఎంపిక ప్యానెల్‌లో క్యాబినెట్ మంత్రి స్థానంలో ప్రధాన న్యాయమూర్తిని నియమించేలా ‘భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు పదవీకాలం) చట్టం, 2023’కు సవరణ చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమములో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట రాములు, ఎన్. గోవర్ధన్, గోనె లక్ష్మి, aikms జిల్లా కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, సురేష్, కిషన్ , డి. బన్షి, ముత్యాల నారాయణ, బి. సాయిలు, జి. భూమన్న, ఆర్. దామోదర్, శ్రీనివాస్ రెడ్డి, రాపాని గంగాధర్, గోవర్ధన్, శివ కుమారులు తదితరులు పాల్గొన్నారు.

