మలేషియా ఫ్లైట్.. ట్రాలీ బ్యాగ్‌లో కోట్ల విదేశీ నోట్లు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)లో భారీగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 22న ఎయిర్ ఏషియా విమానంలో మలేషియాలోని కౌలాలంపూర్ వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడిని హైదరాబాద్ జెడ్ యు డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అతడి ట్రాలీ బ్యాగ్‌లో బట్టల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో దాచిన 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియన్ రింగిట్లు, 2 సింగపూర్ డాలర్లు లభించాయి. వీటి విలువ దాదాపు రూ.63.62 లక్షలుగా గుర్తించారు.

ప్రాథమిక విచారణలో అదే విమానంలో మరొక మహిళా ప్రయాణికురాలు వేరే పీఎన్‌ఆర్‌తో ప్రయాణిస్తున్నట్లు తేలింది. వెంటనే నిఘా పెంచిన అధికారులు ఆ మహిళను కూడా గుర్తించి తనిఖీ చేశారు. ఆమె ట్రాలీ బ్యాగ్‌లోని బట్టల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో దాచిన 97,600 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.91.94 లక్షలు ఉంటుంది.

ఇద్దరు ప్రయాణికుల వద్ద లభించిన విదేశీ కరెన్సీ చట్టబద్ధమైనదేనని నిరూపించే ఎలాంటి పత్రాలు వారి వద్ద లేకపోవడంతో మొత్తం రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీతో పాటు దాన్ని దాచడానికి ఉపయోగించిన ట్రాలీ బ్యాగులను కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం అధికారులు సీజ్ చేశారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>