రామగుండం ఈఎస్ఐ ఆసుపత్రిపై ఎంపీ వంశీకృష్ణ ఆరా

కలం, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతిపాదించిన ఈఎస్ఐ ఆసుపత్రి (ESI Hospital) ఏర్పాటులో పురోగతిపై, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) జిల్లా కలెక్టర్‌ను వివరణ కోరారు. ఆసుపత్రి నిర్మాణానికి భూమి గుర్తింపు, కేటాయింపు, పరిపాలనా అనుమతులు, నిధుల మంజూరు, నిర్మాణ పనుల ప్రస్తుత స్థితిపై సమగ్ర వివరాలు అందించాలని కోరారు. ఆసుపత్రి కోసం భూమి గుర్తించారా? సర్వే నంబర్, విస్తీర్ణం, స్థలం వివరాలేమిటి? భూమిని అధికారికంగా ఈఎస్ఐకి బదిలీ చేశారా? జిల్లా యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు ఎప్పుడు పంపించారు? పరిపాలనా లేదా ఆర్థిక అనుమతులు మంజూరయ్యాయా? ఇంకా ఏ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఎంపీ కోరారు.

రామగుండం (Ramagundam) పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ఈఎస్ఐ ఆసుపత్రి (ESI Hospital) కీలక పాత్ర పోషిస్తుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. ప్రాజెక్టు ఏ దశలో నిలిచిపోయిందో గుర్తించి, పెండింగ్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వెల్లడించాలని సూచించారు. కార్మికుల ఆరోగ్య భద్రతకు కీలకమైన ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటులో జాప్యానికి కారణాలేమిటో స్పష్టం చేయాలి. నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో వెల్లడించాలి అని కోరుతూ, ఏడు రోజుల్లో సమగ్ర కార్యాచరణ నివేదిక అందించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Also Read : ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>