ఎల్లుండి ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ అత్యవసర భేటీ!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఉమ్మడి నాయకత్వంలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలంతా తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది.

రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రత్యేకించి ఎల్‌నినో (El Nino) ప్రభావం వల్ల తలెత్తుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తీవ్ర వర్షాభావం లేదా అకాల వర్షాల వల్ల వ్యవసాయ రంగం, తాగునీటి ఎద్దడి, విద్యుత్ సరఫరాపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మార్గదర్శనం చేయనున్నారు.

అలాగే రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారెంటీల పురోగతి, నియోజకవర్గాల వారీగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతంపై కూడా సమగ్రంగా సమీక్షించనున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సీఎం, డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>