కొత్తగూడెం జిల్లాలో కలకలం.. సమ్మక్క-సారక్క ఆలయం ధ్వంసం!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామ శివారులో ఉన్న సమ్మక్క, సారక్క ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవార్ల పవిత్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ దుశ్చర్యపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ​గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ పైకప్పును పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి, అమ్మవార్ల విగ్రహాలను బయటకు తీసి నేలపై పడేశారు.

అంతేకాకుండా ఆలయంలోని పూజా సామగ్రిని పూర్తిగా చిందరవందర చేసి అపవిత్రం చేశారు. ఇటీవల జరిగిన బతుకమ్మ వేడుకల సమయంలో తలెత్తిన గొడవలే ఈ ఘటనకు ప్రధాన కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు కావాలనే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని ఆరోపించారు.

​దేవాలయాలను, దేవుళ్లను అవమానించే ఇలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దెబ్బతిన్న సమ్మక్క-సారక్క ఆలయాన్ని వెంటనే పునరుద్ధరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read : పోలీస్ ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>