4 తులాల బంగారం కోసం ఘాతుకం.. హుజూర్ నగర్‌లో కలకలం!

‎‎‎కలం, హుజూర్‌నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని ముదిరాజ్ కాలనీలో గుర్తుతెలియని దుండగులు తెగబడ్డారు. మామిడి రాములమ్మ (65) అనే వృద్ధురాలను అత్యంత కిరాతకంగా హతమార్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

ముదిరాజ్ కాలనీకి చెందిన మామిడి రాములమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఈ దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 4 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా తొలగించి చోరీ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే హుజూర్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్ రసాయన, భౌతిక ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. ఈ హత్య కేవలం ఆభరణాల కోసమే జరిగిందా? లేదా దీని వెనుక వేరే ఏవైనా వ్యక్తిగత కక్షలు, ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించి, గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>