అర్ధరాత్రి ఇంట్లోకి భారీ మొసలి.. పల్నాడు జిల్లాలో కలకలం!

కలం, వెబ్ డెస్క్: పల్నాడు (Palnadu) జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ (Guttikonda) గ్రామంలో మొసలి కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఒక భారీ మొసలి హఠాత్తుగా జనావాసాల మధ్యలోకి వచ్చి, ఓ ఇంట్లోకి చొరబడింది (Crocodile Enters House). గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి మొసలి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాణభయంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, గ్రామస్తుల సహాయంతో మొసలిని సురక్షితంగా పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Also Read : రాజస్థాన్ లో దారుణం.. ప్రియుడి కోసం కన్నపేగునే తెంచుకున్న తల్లి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>