దసరా ఉత్సవాలకు నిర్మల్‌ కలెక్టర్‌కు ఆహ్వానం

కలం, నిర్మల్‌ : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్‌ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాకు నిర్వాహకులు అందజేశారు. విశ్వహిందూ పరిషత్‌, శ్రీ ఆంజనేయ గణేష్‌ మండలి, మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో దసరా వేడుకలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శమీ పూజతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాలకు హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ నాయకులు పాల్గొన్నారు.

Also Read : ప్రపంచ రికార్డు బద్దలు.. అదరగొట్టిన శీతల్, తోమన్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>