దుర్గాపూజ భారత్ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక : ద్రౌపది ముర్ము

కలం, వెబ్ డెస్క్ : దుర్గాపూజ (Durga Puja) పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుభాకాంక్షలు తెలిపారు. దేశ, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. దుర్గాపూజ భారత దేశ గొప్ప వారసత్వానికి ప్రతీక అని వెల్లడించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ఇతరుల సంక్షేమం కోసం కృషి చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారని రాష్ట్రపతి (Droupadi Murmu) తెలిపారు. ఈ పర్వదినం భారతీయులందరినీ ఐక్యం చేయడంతో పాటు దేశ సంప్రదాయాలు, జీవనశైలి, కళలు, సంస్కృతిని చాటిచెబుతుందన్నారు. మహిళల శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయంలో భాగమని రాష్ట్రపతి పేర్కొన్నారు. దుర్గా మాతపై నిజమైన భక్తిని చాటుకోవాలంటే మహిళలకు అన్ని విధాలుగా గౌరవం ఇవ్వాలని ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.

Also Read : జాతీయ స్టాక్ మార్కెట్లపై నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>