ఉదయాన్నే వేడి నీళ్లు తాగుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి!

కలం, వెబ్ డెస్క్: ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు వేడి నీళ్లు (Hot Water) తాగడం అనేది మనలో చాలా మందికి ఒక ఆరోగ్యకరమైన అలవాటు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని, బరువు తగ్గుతారని, శరీరం డిటాక్సిఫై అవుతుందని నమ్ముతారు. అయితే మంచి ఉద్దేశంతో చేసే ఈ అలవాటులో కొన్నిచిన్న చిన్న తప్పులు దొర్లితే, అది లాభం కంటే ఆరోగ్యానికి ఎక్కువ నష్టం చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మనం తాగే నీటి ఉష్ణోగ్రత, తాగే పద్ధతి, సమయం సరిగ్గా లేకపోతే శరీరంలోని అంతర్గత అవయవవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉదయాన్నే వేడి నీళ్లు తాగేటప్పుడు సాధారణంగా చేసే ఆ తప్పులు ఏంటో, వాటి వల్ల వచ్చే ఆరోగ్య ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీళ్లు తాగేటప్పుడు చేసే తప్పులు

ఎక్కువ ఉష్ణోగ్రత: గోరువెచ్చని నీళ్లకు బదులు మరుగుతున్న లేదా బాగా ఎక్కువ వేడిగా ఉన్న నీటిని తాగడం.

ఖాళీ కడుపుతో మోతాదుకు మించి తాగడం: పరగడుపున లీటర్ల కొద్దీ వేడి నీటిని ఒకేసారి తాగడం.

వేగంగా తాగడం: నీటిని ఒకేసారి వేగంగా తాగేయడం. దీనివల్ల లాలాజలం నీటితో కలవకుండా లోపలికి వెళ్తుంది.

ప్లాస్టిక్ పాత్రల వాడకం: ప్లాస్టిక్ గ్లాసులు లేదా బాటిల్స్‌లో వేడి నీటిని పోసుకుని తాగడం.

తిన్న వెంటనే తాగడం: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన వెంటనే లేదా తింటున్న సమయంలోనే వేడినీళ్లు తాగడం.

ఎక్కువ వేడి నీళ్లు తాగడం వల్ల వచ్చే నష్టాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాగా వేడిగా ఉండే నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన శరీరానికి జరిగే నష్టాలు

1. నోరు, గొంతు కణాలు దెబ్బతినడం: అతి వేడి నీటి వల్ల నోటి లోపలి చర్మం, నాలుక, అన్నవాహిక లోపలి సున్నితమైన పొరలు కాలిపోతాయి. ఇది దీర్ఘకాలంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

2. కిడ్నీలపై అదనపు భారం: ఉదయాన్నే ఎక్కువ మొత్తంలో వేడి నీటిని ఒకేసారి తాగడం వల్ల శరీరంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దీనిని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.

3. నిద్రలేమి సమస్య: ఎక్కువ వేడి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. ఇది మెదడును చురుకుగా మార్చి, రాత్రి వేళల్లో నిద్ర సరిగ్గా పట్టకుండా చేస్తుంది.

4. అంతర్గత అవయవాల వాపు: అతి వేడి నీరు జీర్ణాశయం, ప్రేగుల లోపలి గోడలను ఇరిటేట్ చేస్తుంది. దీనివల్ల కడుపులో మంట, అల్సర్లు లేదా వాపు వచ్చే ప్రమాదం ఉంది.,

వేడి నీటిని సరిగ్గా తాగే పద్ధతులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం..

  • వేడి నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. అంటే నోరు తట్టుకోగలిగేంత గోరువెచ్చగా మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి.
  • సిప్ చేస్తూ తాగాలి: టీ లేదా కాఫీ తాగినట్టుగా నీటిని కొద్దికొద్దిగా నోట్లో ఉంచుకుంటూ, లాలాజలంతో కలిపి మెల్లగా మింగాలి.
  • కూర్చుని తాగడం: నీళ్లు నిలబడి తాగడం కంటే ఒకచోట ప్రశాంతంగా కూర్చుని తాగడం వల్ల జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు.
  • రాగి లేదా స్టీల్ పాత్రలు: వేటి నీటి కోసం కేవలం రాగి గ్లాస్ లేదా మంచి నాణ్యత గల స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను మాత్రమే వాడాలని చెబుతున్నారు.
  • అరగంట గ్యాప్: ఉదయాన్నే నీళ్లు తాగిన తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల వరకు ఎలాంటి టిఫిన్ లేదా కాఫీ, టీలు తీసుకోకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వేడి నీటి వల్ల కలిగే పూర్తి ఆరోగ్ ప్రయోజనాలను మనం పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>