కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Srihari Rao ) సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ చైర్మన్ కొట్టే శేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, కౌన్సిలర్ పెండెం శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పూదరి అరవింద్, నాందేడపు చిన్ను తదితరులు పాల్గొన్నారు.

