ప్రధాని మోదీ తప్పించుకోలేరు: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: రాజ్యాంగంపై పదే పదే దాడికి పాల్పడుతున్న ప్రధాని మోదీని కచ్చితంగా చట్టం ముందు నిలబెడుతామని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పష్టం చేశారు. గోవాలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మాట్లాడుతూ.. మోదీ తప్పించుకోలేరని హెచ్చరించారు. మోదీ, అమిత్ షా భవిష్యత్తులో కచ్చితంగా తాము చేస్తున్నదానికి మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు. జ్ఞానేష్ కుమార్ రాత్రి నిద్రపోవడం కూడా పోవడం లేదని ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. “ఏదో ఒక రోజు కాంగ్రెస్ కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని మోదీ, అమిత్ షా అర్థమైంది. వారు ఓట్లను దొంగలిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించబోదు. ఆ ముగ్గురు భవిష్యత్తులో ఎదుర్కొనే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి” అని వార్నింగ్ ఇచ్చారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం అవినీతి తారస్థాయికి వెళ్లిపోయిందన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం బహుశా ఇదే కావొచ్చు అని ఎద్దేవా చేశారు. గోవా రాష్ట్రాన్ని బీజేపీ అవినీతికి చిరునామాగా మార్చేసిందన్నారు.

Also Read : ఆందోళనలు ఆపబోం.. అభిజిత్ దీప్కే కీలక ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>